తెలంగాణ

telangana

ETV Bharat / state

'బొగ్గు ఉత్పత్తిలో ఇల్లందు ఏరియా నెంబర్ 1' - BADRADHRI KOTHAGUDEM DISTRICT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గు ఉత్పత్తిలో ఇల్లందు మొదటిస్థానం సాధించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి 53 శాతం బొగ్గు ఉత్పత్తి చేసి అన్ని ఏరియాల్లోకి గణనీయంగా ఉత్పత్తి సాధించినట్లు జీఎం పేర్కొన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైనట్లు ఆయన స్పష్టం చేశారు.

53 శాతం బొగ్గు ఉత్పత్తితో ఇల్లందు ప్రథమ స్థానం
53 శాతం బొగ్గు ఉత్పత్తితో ఇల్లందు ప్రథమ స్థానం

By

Published : May 3, 2020, 9:24 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏప్రిల్‌ మాసంలో గణనీయంగా 53 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ వెల్లడించారు. అన్ని ఏరియాలలో కంటే ఇల్లందు మెరుగైన స్థానంలో నిలిచిందని ఏరియా జీఎం తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ భౌతిక దూరం పాటిస్తూ సమష్టి కృషితోనే మొదటి స్థానం సాధించామని ఆయన వివరించారు. రోడ్డు, రైలు మార్గాల్లో బొగ్గును రవాణా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details