తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు - LOCK DOWN EFFECTS

లాక్​డౌన్​ కారణంగా అధికారులు ఎలాగూ రారన్న నమ్మకంతో దుండగులు అడవులను హరించే పనిలో పడ్డారు. ఇష్టానుసారంగా చెట్లు నరుకుతూ... సైకిళ్లపై తరలిస్తున్నారు.

FORESTS CUT DOWNING IN LOCK DOWN TIME
లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు

By

Published : Apr 16, 2020, 4:22 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కొందరు దుండగులు ఇష్టానుసారంగా చెట్లు నరుకుతూ అడవులను హరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో ఎటువంటి పనులు లేకపోవటం వల్ల అడవుల్లో సంచరిస్తూ చెట్లు నరుకుతున్నారు. తిలక్​నగర్, విజయలక్ష్మీనగర్ పరిధిలోని అడవులలో ఇంటికి కంచె పేరుతో చెట్లు నరికి సైకిళ్లపై తరలిస్తున్నారు.

గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవటం వల్ల అటవీశాఖ అధికారులు సైతం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయకలేకపోతున్నారు. అధికారులు దృష్టి సారించకపోవటం వల్ల దుండగుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు
లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు
లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు
లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు
లాక్​డౌన్ వేళ అడవులను హరిస్తోన్న దుండగులు

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details