తెలంగాణ

telangana

ETV Bharat / state

బూర్గంపాడు మండలంలో తొలి కరోనా కేసు - కరోనా కేసుల తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. మండలంలోని సారపాకలో ఓ వ్యక్తి వైరస్‌ పాజిటివ్ నిర్ధరణ కాగా.. హైదరాబాద్‌ తరలించారు. మొదటి కేసు నమోదవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు కాంటాక్ట్‌లను పరిశీలిస్తున్నారు.

బూర్గంపాడు మండలంలో తొలి కరోనా కేసు
బూర్గంపాడు మండలంలో తొలి కరోనా కేసు

By

Published : Jun 27, 2020, 1:31 PM IST

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సారపాకలోని తాళ్ల గొమ్మూరు కాలనీకి చెందిన వ్యక్తికి వైరస్‌ పాజిటివ్ రావడం వల్ల మండల అధికారులంతా అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. అతని కుటుంబ సభ్యులకు స్టాంప్‌ వేసి.. హోం క్వారంటైన్‌లో ఉంచారు.

ఆ ఏరియా మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మొదటిసారి మండలంలో కొవిడ్‌ కేసు నమోదవడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కరోనా పాజిటివ్ రాకముందు ఆ వ్యక్తి ఎవరెవరితో తిరిగాడు, ఏ ప్రదేశాలకు వెళ్లాడు అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details