భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ముందు రైతులు ఆందోళనకు దిగారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రామంలోని రహదారిపై ధాన్యం బస్తాలతో బైఠాయించి నిరసన తెలిపారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన - latest news on Farmers' concern over buying grain
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత 4 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేశారు. ఫలితంగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన
కొనుగోలు కేంద్రంలో గత నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు సాగటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల వర్షం పడితే ధాన్యం తడిసిపోతుందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!