తెలంగాణ

telangana

ETV Bharat / state

'గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు' - TRS

గడియకో అబద్ధం చెప్పే తండ్రీకొడుకులకు ఈ నెల 11న ప్రజలే బుద్ధి చెప్తారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో భాజపా అధికారంలో ఉండి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు

By

Published : Mar 28, 2019, 1:35 PM IST

గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు
దేశ భవిష్యత్తును నిర్ణయించేది లోక్​సభ ఎన్నికలేనని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని వేల మందికి కట్టించారని ప్రశ్నించారు. మోదీ పేద ప్రజల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తానని చెప్పి పైసా కూడా వేయలేరని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలు కేవలం దేశానికి సంబంధించినవని రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details