భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పోలీసులు నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల వారు నగరంలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. చెక్‌పోస్టుల పరిశీలనకు ఇద్దరు ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఎం.వి రెడ్డి నియమించారు. ఈ చెక్ పోస్టులను ఎమ్మెల్యే హరిప్రియ, తహసిల్దార్ మస్తాన్ రావు పర్యవేక్షించారు.
ఇల్లందు సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు
ఇల్లందులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పట్టణాన్ని అధికారులు అష్టదిగ్భందనం చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి పట్టణంలోకి వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇల్లందు సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు
రంజాన్ మాసం ప్రారంభం కావటం వల్ల ఇల్లందు పోలీస్ స్టేషన్లో మత పెద్దలతో సీఐ వేణు చందర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించి ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. మాణిక్యరం పంచాయతీలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు దుకాణదారులకు రెండు వేల చొప్పున అధికారులు జరిమానా విధించారు.