భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. పలు పుణ్యక్షేత్రాల్లో శివలింగం ఏరూపంలో దర్శనమిస్తుందో అదేవింధంగా వీటిని ఉంచారు.
భద్రాచలంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం - jyothirlimgalu in bhadrachalam
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భద్రాచలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో కొలువైన శివలింగ స్వరూపాలులా ఏర్పాటు చేశారు.
భద్రాచలంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం
కార్యక్రమాన్ని భద్రాద్రి రామయ్య సన్నిధి విశ్రాంత ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు ప్రారంభించారు. అనంతరం ఒక్కో లింగం వద్ద పాకాల దుర్గాప్రసాద్, భూపతి రావు జైలర్ ఆనందరావు, అల్లం నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. నేటి నుంచి ఈనెల 21 వరకు నిత్యం ప్రత్యేక అభిషేకాలు ఉంటాయిని బ్రహ్మకుమారీ సంఘం అధ్యక్షురాలు తెలిపారు.