తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాయేతర పార్టీలతో పొత్తులకు సిద్ధం: కూనంనేని - kunamneni sambashiva rao gave clarity on alliances

స్థానిక పరిస్థితులను బట్టి భాజపాయేతర పార్టీలతో కలిసి మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెంలో మాత్రం తెరాసకు పోటీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

భాజపాయేతర పార్టీలతో పొత్తులకు సిద్ధం: కూనంనేని
భాజపాయేతర పార్టీలతో పొత్తులకు సిద్ధం: కూనంనేని

By

Published : Jan 6, 2020, 11:48 PM IST

పురపాలక ఎన్నికల్లో భాజపాయేతర పార్టీలతో కలిసి సీపీఐ ముందుకు సాగనుందని... ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ముందుగా లెఫ్ట్ పార్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన... తెదేపా, కాంగ్రెస్​తో పాటు స్థానికతను బట్టి తెరాసతోనూ పొత్తులు ఉండే అవకాశం ఉందన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొత్తులు ఎలా ఉన్నా... కొత్తగూడెంలో మాత్రం తెరాసతోనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికల ప్రక్రియలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రిజనర్వేషన్ల ఖరారులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆక్షేపించారు. ఎన్నికలు వాయిదా వేసి... రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.

భాజపాయేతర పార్టీలతో పొత్తులకు సిద్ధం: కూనంనేని

ఇదీ చూడండి: "ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details