కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పోచారం తండాకు చెందిన కాకర రైతు కుటుంబానికి చేదు వార్త వినిపించింది. ముగ్గురు రైతులు తాము సాగు చేసిన కాకర పంటను టాటా ఏసీ ట్రాలీలో తీసుకుని ఖమ్మం మార్కెట్లో అమ్మడానికి వెళ్తుండగా రఘునాథపాలెం వద్ద లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
విషాదం: కాకర ఆ రైతు కుటుంబంలో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది
కౌలు భూమిలో కాకర పండించిన పేద రైతు... పంట విక్రయానికి వెళ్తూ మృత్యువాత పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన రఘానాథపాలెం వద్ద చోటుచేసుకుంది.
ఆ రైతు కుటుంబంలో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన కాకర సాగు
ఈ ప్రమాదంలో కొమరారానికి చెందిన భయ్యా ఉప్పలయ్య(40) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.