భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే హరిప్రియ రైతు వేదికలను ప్రారంభించి.. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. జిల్లాలోని ఇల్లందు మండలం కొమరారం రేపల్లె వాడలో నిర్మించిన రైతు వేదికలను ఆమె ప్రారంభించారు.
'రైతు వేదికలను శుభకార్యాలకు అద్దెకు ఇవ్వొచ్చు' - bhadradri kothagudem latest news '
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
రైతు వేదిక ప్రారంభం
ఈ కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా.. రైతులకు వ్యవసాయ రంగంపై సందేహాలు తీర్చేలా రైతు వేదికలు రూపొందాయని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. వీటి నిర్వహణ కోసం స్థానికులకు శుభకార్యాలకు అద్దెకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.