తెలంగాణ

telangana

భద్రాచలం బంద్‌.. జీవో నం.45 రద్దుకు ప్రతిపక్షాల డిమాండ్

By

Published : Dec 19, 2022, 10:40 AM IST

Bhadrachalam bandh : భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ పట్టణంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ శ్రేణులు బంద్ ప్రకటించారు. బస్టాండ్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 45ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Bhadrachalam bandh
Bhadrachalam bandh

భద్రాచలం బంద్‌.. జీవో నం.45 రద్దుకు ప్రతిపక్షాల డిమాండ్

Bhadrachalam bandh : భద్రాచలం అభివృద్ధిపై అనేకసార్లు అసెంబ్లీలో లేవనెత్తినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మండిపడ్డారు. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజించడాన్ని వ్యతిరేకిస‌్తూ బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిర్ణయాన్ని ప్రజలెవరు హర్షించరని అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవోకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీగా మోహరించడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details