ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: రాఠోడ్ జనార్దన్ - ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: రాఠోడ్ జనార్దన్
విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషిచేయాలని.. తాను అధ్యాపకుల సమస్యలు పరిష్కారిస్తానని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు రాఠోడ్ జనార్దన్ అన్నారు. గంగన్నపేట ప్రాథమిక పాఠశాలలో పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: రాఠోడ్ జనార్దన్
విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గంగన్నపేట ప్రాథమిక పాఠశాలలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిత్యం కృషిచేస్తోందని జడ్పీ ఛైర్మన్ తెలిపారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు.