ETV Bharat / state

'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు" - ktr speak about cm

రాబోయే మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​. తాను సీఎం అవుతానన్న చర్చే అవసరం లేదన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. 2020-30 దశకం తెరాసదేనని చెప్పారు. కొత్త దశకంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ktr chit chat with media in Hyderabad
నేను సీఎం అవుతానన్న చర్చే లేదు: కేటీఆర్‌
author img

By

Published : Jan 1, 2020, 4:28 PM IST

Updated : Jan 1, 2020, 4:50 PM IST

నేను సీఎం అవుతానన్న చర్చే లేదు: కేటీఆర్‌
హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ మీడియాతో చిట్​ చాట్​ చేశారు. 2019 బ్రహ్మండమైన ఆరంభం ఇచ్చిందని తెలిపారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో శుభారంభం చేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను కేసీఆర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. తాను సీఎం అవుతానన్న చర్చే అవసరం లేదన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు.

ఈ నెల మొదటి వారంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. 2020-30 దశకం తెరాసదేనని చెప్పారు. కొత్త దశకంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే

పటిష్టమైన నూతన మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చామని.. చట్టాన్ని సమర్థంగా అమలు చేయడమే మా ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ఏపీ సహా పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కేంద్ర సహాకారం లేకున్నా

ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే.. దేశానికే మంచిది.. అందులోనూ రాజకీయాలు ఆలోచిస్తే దేశానికే మంచిది కాదన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల కల సాకారం కావాలంటే.. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలని చెప్పారు. ఈ ఏడాది ఫార్మా సిటీ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 3న ముంబైలో జరగనున్న ఫార్మా సదస్సుకు హాజరువుతానని తెలిపారు. ఫార్మా, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను రానున్న నాలుగేళ్లలో అభివృద్ధి చేస్తాం పేర్కొన్నారు.

ఎంఐఎంతోకలిసి పోటీ చేసే ప్రసక్తే లేదు

హైదరాబాద్ పాతబస్తీలో తప్పకుండా మెట్రో రైల్ వస్తుందన్నారు. ఎంఐఎంతో స్నేహ సంబంధాలు ఉంటాయి.. కానీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మాకు రాజకీయాల్లో శత్రువులు ఎవరూ లేరూ... బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రత్యర్థులే.. కేంద్రం ఎలాంటి సహాయం చేయక పోయినా... హైదరాబాద్ ఐటీ అగ్రస్థానంలోనే ఉంటుంది.

చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా ఏపీతో సత్సంబంధాలే కొనసాగించామని గుర్తు చేశారు.

ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే

పీసీసీ పదవి వదులు కుంటానని ఉత్తమ్ పేర్కొనడం ఆయన వ్యక్తిగతమన్నారు. కాంగ్రెస్ సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ... ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేము. మాకు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే.. బీజేపీ నేను చిన్నప్పుడు ఎలా ఉందో... ఇప్పడు అలాగే ఉంది. హైదరాబాద్ సీపీ విషయంలో ఉత్తమ్ అలా మాట్లాడటం సరి కాదన్నారు.

ఇదీ చూడండి: భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

Last Updated : Jan 1, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.