తెలంగాణ

telangana

ETV Bharat / state

రాంపూర్​ పొలాల్లో అడవి పందుల స్వైరవిహారం..

పంటపొలాల్లో అడవి పందులతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఖరీఫ్​ సీజన్​ ప్రారంభం కావడంతో భూమిని సాగు చేసిన రైతులకు పందులు ఆందోళన కలిగిస్తున్నాయి. విత్తనాలు మొలవకముందే పొలాల్లో గుంపుగుంపులుగా విహారం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

wild animals in rampur
రాంపూర్​ పొలాల్లో అడవి పందుల స్వైరవిహారం

By

Published : Jun 11, 2021, 11:40 AM IST

ఖరీఫ్ ఆరంభంలోనే అడవి పందులు.. రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వర్షాకాలం మొదలు కాగానే రైతులంతా తమ పొలాలను సాగు చేయడం ప్రారంభించారు. పత్తి, జొన్న, కంది విత్తనాలను వేశారు. కానీ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ శివారులో పదుల సంఖ్యలో అడవి పందులు గుంపులుగా పొలాల్లో వీరవిహారం చేస్తున్నాయి.

భూమిని తోడి మరీ వేసిన పత్తి, కంది గింజలు తింటున్నాయని రైతులు వాపోతున్నారు. వాటిని దూర ప్రాంతాలకు తరలించి.. పందుల బెడద లేకుండా పంటలు కాపాడాలని అధికారులను వేడుకున్నారు.

రాంపూర్​ పొలాల్లో అడవి పందుల స్వైరవిహారం..

ఇదీ చదవండి:Haritha haram: ఏడో విడత.. 'హరిత' సన్నద్ధత

ABOUT THE AUTHOR

...view details