Amit Shah tour in Adilabad: ఈనెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల బలోపేతంపై దృష్టిపెట్టిన బీజేపీ తొలిసభను ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించడంతో ఆపార్టీ శ్రేణులు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కోర్ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లా ప్రభారీ అల్జాపూర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొనగా.. ఆయా జిల్లా అధ్యక్షులు పాయల్‌శంకర్, డా.శ్రీనివాస్, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ తదితరులు హాజరై.. సభను ఎలా విజయవంతం చేయాలి అనే దానిపై విస్తృతంగా చర్చించారు.