తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత - water

ఆదిలాబాద్ జిల్లా తంతోలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆదిలాబాద్​ రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులు

By

Published : Mar 9, 2019, 9:34 PM IST

అస్వస్థతకు గురైన విద్యార్థులు
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని తంతోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెజ్​ బిర్యాణి తిని పాఠశాల ఆవరణలోని బోరు నీళ్లు తాగారు. సాయంత్రం కడుపునొప్పి, వాంతులు చేసుకొని 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. బోరు నీరు వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండొచ్చని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. నీరు బాగాలేవని చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చామని.. అయినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details