తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 11:05 PM IST

ETV Bharat / state

చావుపుట్టుకలను సమానంగా చూస్తారక్కడ..!

ఓ ఇంట్లోకి నూతనంగా ఒకరు కుటుంబ సభ్యులుగా చేరితే ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకుంటారు. అదే ఉన్నత స్థాయి గల వ్యక్తి అనుకోకుండా ఆ కుటుంబానికి దూరమైతే.. వారి ఆత్మశాంతి కోసం అంబరాన్ని అంటేలా సంబురాలు జరుపుతూ స్మశానంలో డోలు వాయిద్యాల నడుమ దహన సంస్కారం చేయడం ఆదివాసీల ఆనవాయితీ. నాటి నుంచి నేటి వరకు వారి సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆదివాసి గ్రామాల్లో కొన్నేళ్లుగా స్మశాన వాటికలో జరుపుకుంటున్న సంబురాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

special story on adilabad tribes special culture
చావుపుట్టుకలను సమానంగా చూస్తారక్కడ..!

సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ గిరిజనుల తీరు ప్రత్యేకం. పుట్టుకను, చావును సంబురంగానే జరుపుకుంటారు. ఆత్మీయులకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలుకుతారు. డోలు వాయిద్యాల శబ్దాల నడుమ అంత్యక్రియలను వేడుకల నిర్వహిస్తారు.

ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. తాజాగా అదే గ్రామానికి చెందిన పటేల్ మరణిించాడు. వీరికి సాధారణ పద్ధతిలో కాకుండా ఆదివాసీల సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలు మోగిస్తూ.. నృత్యాల నడుమ దహన సంస్కారాలు నిర్వహించారు. ఇలా చేస్తే మరణించినవారి ఆత్మ శాంతిస్తుందని.. ఆ ఇంట్లోనే మళ్లీ జన్మిస్తాడనేది వారి నమ్మకం.

మృతి చెందిన వారిని దహనం చేసే సమయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు డోలు వాయిద్యాల నడుమ నృత్యం చేస్తామని గిరిజనులు తెలిపారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఈ ఆచారాలను ఇలాగే కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఇప్పటివరకు 70 లక్షల సభ్యత్వాలు వచ్చాయి: కేటీఆర్​​

ABOUT THE AUTHOR

...view details