అటవీ సిబ్బంది తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయుపేట గ్రామస్థుల ఆందోళనకు దిగిన సంగతి మరవకముందే.. తాజాగా అదే గ్రామం కేంద్రంగా కలప అక్రమ రవాణా చేస్తున్న డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి ముక్తార్ అహ్మద్‌ను సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది.
ఆదిలాబాద్ అటవీ రేంజ్ అధికారి సస్పెండ్ - range officer
ఆదిలాబాద్ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ముక్తార్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కలప దుంగలతో ఫర్నీచర్ చేయించి అక్రమ రవాణా చేస్తున్నందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
వాయుపేటలోని ఓ ఇంట్లో అక్రమంగా కలప నిల్వ ఉందన్న సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిని అడ్డుకున్న గ్రామస్థులు... ఇంటి అవసరాల కోసమే కలప తెచ్చుకున్నట్టు వివరించారు. కలప అక్రమ రావాణా చేస్తున్న అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంవ లేదంటూ నిలదీశారు. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారించగా... కలప దుంగలతో ఫర్నీచర్ చేయించి అక్రమ రవాణా చేస్తున్న డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి భాగోతం బయటపడింది. వెంటనే ముక్తార్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎఫ్‌వో ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: 'రైతు రుణమాఫీ ఒకే దశలో అమలు చేయాలి'