తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు - farmers struggles to sell their grains in adilabad

లారీలు లేక కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. ఈరోజు కురిసిన చిరుజల్లుల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు ఆపసోపాలు పడ్డారు.

farmers struggles to sell their grains in adilabad
ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు

By

Published : Dec 26, 2019, 3:18 PM IST

ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు

చిరుజల్లులు... ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ రైతుల గుండెలు ఝల్లుమనేలా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మే సమయానికి అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చేలా చేస్తోంది.

ఉట్నూర్​ కొనుగోలు కేంద్రంలో.. విక్రయించిన ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు లేక మూడ్రోజుల నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. చేసేదేం లేక రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు.

ఈరోజు కురిసిన చిరుజల్లుల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. గ్రామ సమైక్య సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details