తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది' - Adilabad district latest news

ఉద్యోగుల పట్ల రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని... ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆదిలాబాద్​ జిల్లా నాయకుడు రవీందర్​ ఆరోపించారు. ఉద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఐక్యవేదిక చేపట్టిన కలెక్టరేట్​ ముట్టడి ఉద్రిక్తలకు దారితీసింది.

employees union members protest at Adilabad Collectorate
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది

By

Published : Jan 23, 2021, 5:22 PM IST

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని... ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక చేపట్టిన ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, ఒప్పంద కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళన చేపట్టినట్లు... ఐక్యవేదిక జిల్లా నాయకుడు రవీందర్​ తెలిపారు.

ఉద్యోగుల పట్ల రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐక్యవేదిక సభ్యులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చివరికి అన్ని ద్వారాలను మూసివేయగా... ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టరేట్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

ABOUT THE AUTHOR

...view details