ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో పేలుడు ఘటన కలకలం రేపింది. చెక్‌డ్యామ్ నిర్మాణంలో భాగంగా బండరాళ్లను బ్లాస్టింగ్ చేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్ల కారణంగా బండరాళ్లు గ్రామాల్లోకి ఎగిసిపడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులు, కుటుంబీకులు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం వల్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
బండరాళ్లను పేల్చే క్రమంలో యువకుడికి తీవ్రగాయాలు - adilabad district
ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో చెక్‌డ్యామ్ నిర్మాణం కోసం బండరాళ్లను బ్లాస్టింగ్ చేసే క్రమంలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

బండరాళ్లను బ్లాస్టింగ్ చేసే క్రమంలో ఓ యువకుడికి తీవ్రగాయాలు