ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

వీళ్లు పోలీసులా ?? లేక గులాబీ కార్యకర్తలా ?? - సీపీఐ నేత గుండా మల్లేశ్

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​లపై అసత్య ప్రచారం చేశారనే అభియోగంపై అరెస్ట్ చేయడాన్ని సీపీఐ నేత గుండా మల్లేశ్ ఆదిలాబాద్​లో ఖండించారు.

పోలీసులు గులాబీ నేతలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు : గుండా మల్లేశ్
author img

By

Published : Oct 27, 2019, 12:35 PM IST

పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్న మాదిరిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​లపై వాట్సప్ గ్రూపుల్లో అసత్య ప్రచారం చేశారనే నెపంతో అరెస్టు చేయడాన్ని ఖండించారు. పోలీసులు గులాబీ నేతలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో మంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు గులాబీ నేతలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు : గుండా మల్లేశ్
ఇవీ చూడండి : విశ్వనగరం పేరుతో... విష నగరంగా మహానగరం: కిషన్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details