రాష్ట్ర ప్రభుత్వం విశ్వనగరం పేరుతో హైదరాబాద్ మహానగరాన్ని విషనగరంగా మార్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. లాలాపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరై కాంగ్రెస్ నాయకులు సుక్క గణేష్ ముదిరాజ్‌తో పాటు వంద మందిని పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలో ఎక్కడ చూసిన సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 50 వేల మంది ఆర్టీసీ కార్మికులని తొలగిస్తామనడం దారుణమన్నారు. నిజాం అడుగుజాడల్లో నడుస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి... భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని... ఖైరతాబాద్ నియోజకవర్గంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ను మోదీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు... ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు