ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛ కార్మికుల ధర్నా - aituc latest updates
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛ కార్మికుల ధర్నా
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛ కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో ఆదుకోవాల్సింది పోయి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పేర్కొన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను పంచాయతీకి అప్పగించవద్దని, అలాచేస్తే పాఠశాలలు మురికికూపాలుగా మారుతాయన్నారు. వెంటనే తొలగింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.