తెలంగాణ

telangana

ఆదిలాబాద్​ పట్టణంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

By

Published : Jul 2, 2020, 5:00 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఆదిలాబాద్​ పట్టణంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు
ఆదిలాబాద్​ పట్టణంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌ పట్టణం మహాలక్ష్మివాడలో ఇంట్లో నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కాలనీలో శ్రీనివాస్ బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం బాటిళ్లలో నీరు కలుపుతున్నారనే పక్కా సమాచారం మేరకు సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. టూటౌన్‌ ఎస్సై నాందేవ్‌ ఆధ్వర్యంలో నిందితుడి నుంచి రూ.50వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు.

ఆదిలాబాద్​ పట్టణంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details