ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరజ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరు గర్భిణీ కావడం వల్ల హుటాహుటిన ఆమెను 108 అంబులెన్సులో రిమ్స్ ఆసుపత్రికి తరలివచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డారు. బోరజ్ వద్ద జాతీయరహదారికి ఆనుకుని అంతర్గత రోడ్డును నిర్మించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. తాజా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తతంగా వ్యవహరించడం వల్ల త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
బోరజ్ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం - bus
ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
త్రుటిలో తప్పిన ప్రమాదం