తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2019, 10:38 AM IST

Updated : Dec 3, 2019, 12:13 PM IST

ETV Bharat / sports

స్విస్​ నాణేలపై ఫెదరర్​.. ఆ దేశ చరిత్రలో తొలిసారి

టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో స్విట్జర్లాండ్​ కరెన్సీ​ నాణేలపై ఈ ఆటగాడి​ బొమ్మ కనిపించనుంది. ఓ క్రీడాకారుడు బ్రతికి ఉన్నప్పడే ఇలాంటి ఘనత దక్కడం స్విస్ చరిత్రలో ఇదే తొలిసారి.

swiss tennis star roger federer is the first living swiss to have a coin minted in their honour
స్విస్​ కరెన్సీపై ఫెడరర్​... చరిత్రలో తొలిసారి

స్విట్జర్లాండ్​ టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​కు అత్యున్నత గౌరవం లభించింది. స్విస్​ ప్రభుత్వం అతడి చిత్రంతో కరెన్సీ నాణేలను ముద్రించింది. 55వేల కాయిన్లు రూపొందిస్తుండగా.. వాటిని ప్రీ ఆర్డర్​ రూపంలో నేటి నుంచి డిసెంబర్​ 19 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఫెదరర్​ ఆనందం వ్యక్తం చేశాడు.

" ధన్యవాదాలు స్విట్జర్లాండ్​.. నా బొమ్మతో నాణేలను ముద్రించడం చాలా గౌరవంగా, ఘనతగా భావిస్తున్నా."
- రోజర్​ ఫెదరర్​, టెన్నిస్​ క్రీడాకారుడు

చరిత్రలో మొట్టమొదటిసారి..

స్విస్​ ప్రభుత్వం ఇప్పటివరకు పలు రంగాల్లో దేశానికి సేవ చేసిన వారికి ఈ విధమైన గౌరవం కల్పించింది. అయితే తొలిసారి బ్రతికి ఉన్న వ్యక్తి ఈ ఘనత సాధించడం విశేషం. ఈ ఏడాది జనవరిలో ఫెదరర్​ బొమ్మతో 20 ఫ్రాంక్​​ వెండి నాణేన్ని బహిర్గతం చేసింది. ఆ కాయిన్​పై అతడి సూపర్​షాట్​ అయిన బ్యాక్​​ హ్యాండ్​తో ఫోజును ముద్రించారు.

స్విస్​ నాణేలపై ఫెడరర్​

ఇప్పటికే ఈ నాణేల కోసం భారీగా పోటీ నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది 50 ఫ్రాంక్​​ గోల్డ్​ కాయిన్​నూ వేరే డిజైన్​తో తీసుకురానున్నట్లు చెప్పారు. మరో 40 వేల నాణేలను ముద్రించి వచ్చే ఏడాది మే నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Last Updated : Dec 3, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details