తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2019, 12:53 PM IST

Updated : Sep 28, 2019, 11:01 AM IST

ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​లో సెరెనా శుభారంభం

ఆర్థర్​ ఆష్ స్టేడియం వేదికగా జరిగిన యూఎస్​ ఓపెన్​ తొలి రౌండ్​లో షరపోవా(రష్యా)పై సెరెనా విలియమ్స్(అమెరికా)​ విజయం సాధించింది. 6-1, 6-1 తేడాతో గెలిచి రెండో రౌండ్​లో అడుగుపెట్టింది.

సెరెనా విలియమ్స్, షరపోవా

యూఎస్ ఓపెన్​లో అమెరికా టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​ జోరు చూపించింది. ఆర్థర్​ ఆష్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్​లో రష్యా టెన్నిస్​ స్టార్​ మారియా షరపోవాపై విజయం సాధించింది.

యూఎస్​ ఓపెన్ ​ తొలి రౌండ్​లో షరపోవా సెరెనా విలియమ్స్ విజయం

సెరెనా ముందు మాజీ ఛాంపియన్ షరపోవా చిన్నబోయింది. మొదటి నుంచి ఆధిపత్యం వహించిన సెరెనా 59 నిమిషాల్లో ఆటను పూర్తి చేసింది. 6-1, 6-1 తేడాతో గెలిచి రెండో రౌండ్​లో అడుగుపెట్టింది.

"షరపోవా మంచి ప్లేయర్​. ఆమెతో ఆడినప్పుడు చాలా ఏకాగ్రతగా ఉంటూ.. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా" -సెరెనా విలియమ్స్​, అమెరికా టెన్నిస్​ క్రీడాకారిణి

ఇప్పటికే యూఎస్​ ఓపెన్​లో ఆరుసార్లు విజేతగా నిలిచింది సెరెనా. ఏడోసారి టైటిల్ ముద్దాడాలని చూస్తోంది.

ఎనిమిదో సీడ్ సెరెనా రెండో రౌండ్​లో 121 ర్యాంకులో ఉన్న మరో అమెరికా టెన్నిస్ ప్లేయర్​ మెక్​నల్లీతో తలపడనుంది.

Last Updated : Sep 28, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details