స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్ పాల్గొని స్వదేశం స్పెయిన్ చేరుకున్నాడు. అక్కడ చేసిన పరీక్షల్లో ఇతడికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయమై ట్వీట్ కూడా చేశాడు నాదల్.
Nadal corona: స్టార్ ప్లేయర్ నాదల్కు కరోనా - covid 19 new cases
Covid 19: అబుదాబి ఎగ్జిబిషన్ ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నాదల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
రఫెల్ నాదల్
"నేను కొంత బాధలో ఉన్నాను. ఇందులో నుంచి త్వరగా బయటపడతానని అనుకుంటున్నాను. నాతో క్లోజ్‌గా ఉన్న వారందరూ కరోనా టెస్ట్‌లు చేయించుకోండి" అని నాదల్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: