రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా తనకు కాబోయే వాడి గురించి వెల్లడించింది. తనతో మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న బ్రిటన్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కిస్తో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోల్ని పోస్ట్ చేసింది.
గతేడాది షరపోవా వేలికి ఉంగరం కనిపించినప్పటి నుంచీ వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి. ఇప్పుడు ఆ విషయమై స్పష్టతనిచ్చింది.
ఇప్పటివరకు ఐదు గ్లాండ్స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న షరపోవా.. గతంలో పలువురితో బంధం కొనసాగించింది. 2010లో స్లోవేకియా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు శాశతో నిశ్చితార్థం జరిగింది. కానీ 2012లో వారిద్దరూ విడిపోయారు. బల్గేరియా టెన్నిస్ క్రీడాకారుడు దిమిత్రోవ్‌తో రెండేళ్ల పాటు డేటింగ్ చేసి, 2015లో విడిపోయింది. వ్యాపారవేత్త గిల్కిస్.. గతంలో ఓ ఫ్యాషన్ డిజైనర్‌ను విహాహం చేసుకుని 2016లో విడిపోయారు.
ఇదీ చూడండి:టెన్నిస్‌కు కర్మన్ కౌర్ లాంటి అందం తోడైతే!