తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ 2020లో రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు.

Leander prepares for one last roar, to retire in 2020
చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

By

Published : Dec 25, 2019, 9:49 PM IST

భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తన సుదీర్ఘ కెరీర్​కు వీడ్కోలు పలకనున్నాడు. 2020లో ఆటకు గుడ్​బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం ఈ విషయాన్ని తెలియజేశాడు. కెరీర్​లో మొత్తం 54 టైటిల్స్​ గెలిచాడు. ఇందులో 18 గ్రాండ్​స్లామ్ డబుల్స్​ ట్రోఫీలు ఉన్నాయి.

"2020లో ఆటకు గుడ్​బై చెప్పాలని అనుకుంటున్నా. వచ్చే ఏడాది ఎంపిక చేసుకున్న టోర్నీల్లోనే ఆడాలనుకుంటున్నా. కుటుంబం, మిత్రులతో నా రిటైర్మెంట్​ వేడుకలను జరుపుకోవాలనుకుంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. మీ ప్రోత్సాహం, క్రమశిక్షణ, పెంపకం, ప్రేమ ఇక్కడకు వరకు వచ్చా. మీరు లేకుంటే నేను లేను. ఐ లవ్యూ" - లియాండర్ పేస్, టెన్నిస్ స్టార్

తన సొదరీమణులకు, కూతురు ఐనాకు కూడా ధన్యవాదాలు చెప్పాడు పేస్. #వన్ లాస్ట్​ రోర్ అనే హ్యాష్​ట్యాగ్​తో తన మధుర జ్ఞాపకాలను షేర్​ చేయాలని అభిమానులను కోరాడు. 2020 భావోద్వేగంతో ఉండబోతోందని తెలిపాడు.

డెవిస్​కప్​లో అత్యధిక డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా పేస్​ చరిత్ర సృష్టించాడు. మొత్తం 44 టైటిల్స్​తో ఘనత సాధించాడు. ఇటీవలే గత 19ఏళ్లలో మొదటి సారి టాప్-100లో చోటు కోల్పోయాడు లియాండర్ పేస్.

ఇదీ చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా కుమారి ఫొగాట్

ABOUT THE AUTHOR

...view details