భారత రెజ్లర్లు గీతాకుమారి ఫొగాట్, పవన్‌కుమార్ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది గీత.
"హల్లో బాయ్!! ఈ ప్రపంచానికి స్వాగతం. అతనొచ్చేశాడు. మేం ప్రేమలో మునిగిపోయాం. మా చిన్నారికి మీ ప్రేమ, ఆశీర్వాదాలను అందించండి. అతడు మా జీవితాలను పరిపూర్ణం చేశాడు. బిడ్డకు జన్మనివ్వడం కన్నా మెరుగైన అనుభూతి మరింకేం ఉండదు" - గీతా కుమారి ఫొగాట్, భారత రెజ్లర్
అనంతరం గీత, పవన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. రెజ్లర్ బబిత వారికి శుభాకాంక్షలు తెలియజేసింది. చిన్నారితో తీసుకున్న చిత్రాన్ని ట్వీట్ చేసింది.
2010 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం అందుకున్న భారత తొలి మహిళగా గీత చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కెనడాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచింది. ఆమె కుటుంబంలో అందరూ రెజ్లర్లే కావడం విశేషం.
ఇదీ చదవండి: గంగూలీది ఫ్లాప్ ఐడియా: పాక్ మాజీ కెప్టెన్