తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సోఫియా, ముగురుజా - ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ఆష్ బార్టీ ఔట్

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో మరో సంచలనం నమోదైంది. నెంబర్​వన్ క్రీడాకారిణి ఆష్ బార్టీ సెమీఫైనల్లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.

బార్టీ
బార్టీ

By

Published : Jan 30, 2020, 12:10 PM IST

Updated : Feb 28, 2020, 12:28 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో ప్రపంచ నెంబర్​వన్ ఆష్ బార్టీ కథ ముగిసింది. అమెరికన్ ప్లేయర్ సోఫియా కెనిన్​తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్​లో ఓడి ఇంటిముఖం పట్టింది. పోటీపోటీగా సాగిన ఈ పోరులో 7-6(6), 7-5 తేడాతో విజయం సాధించి తొలిసారి గ్రాండ్​స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది సోఫియా.

ఈ మ్యాచ్​కు ముందు సోఫియాపై 4-1 తేడాతో బార్టీదే పైచేయి. కానీ ఈ పోరులో సోఫియా విజయమే లక్ష్యంగా ఆడింది. నెంబర్​ వన్​ క్రీడాకారిణిపై గెలుపుతో తొలి గ్రాండ్​స్లామ్​ టైటిల్​కు అడుగు దూరంలో నిలిచింది.

మరో సెమీఫైనల్లో సైమోనా హలెప్​పై గెలిచి ఫైనల్లో ప్రవేశించింది ముగురుజ. 7-6(8),7-5 తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో సోఫియా కెనిన్​తో తలపడనుందీ మాజీ నెంబర్ వన్.

ఇవీ చూడండి.. అభిమానుల మద్దతు బాగుంది: సిక్కిరెడ్డి

Last Updated : Feb 28, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details