ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో బుధవారం హైదరాబాద్ హంటర్స్ జట్టు 2-1తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై గెలిచింది. హైదరాబాద్ తరఫున ఇవనోవ్- సిక్కిరెడ్డి, బెన్ లేన్-ఇవనోవ్, డారెన్ లూ విజయాలు సాధించారు. విజయం అనంతరం హైదరాబాద్ షట్లర్ సిక్కిరెడ్డి ఈటీవీ భారత్‌తో మాట్లాడింది.
"నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫలితంపై సంతోషంగా ఉన్నా. మిగతా మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తామని ఆశిస్తున్నా. అభిమానులు మ్యాచ్‌లకు వచ్చి మద్దతు తెలపాలని కోరుకుంటున్నా."
-సిక్కిరెడ్డి, భారత షట్లర్
ఈ మ్యాచ్‌లో మరో హైదరాబాద్ ప్లేయర్ పీవీ సింధు ఓటమిపాలైంది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌కు చెందిన మిచెల్లీ లీ చేతిలో 15-8, 15-9 తేడాతో పరాజయంపాలైంది.
ఇవీ చూడండి.. భారత్‌తో వన్డే సిరీస్‌కు కివీస్ జట్టు ప్రకటన