తెలంగాణ

telangana

ETV Bharat / sports

గురి చూసి గోల్​ కొట్టిన జింక... ఆపై గంతులు! - జింక ఫుట్​బాల్​

మనుషులేనా ఆటలు ఆడేది నేను కూడా ఆడతా అంటూ మైదానంలో సందడి చేసింది ఓ జింక. అంతేకాదు అద్భుతంగా తన కొమ్ములతో బంతిని గోల్​ పోస్టులోకి పంపింది. ఆ తర్వాత తనదైన రీతిలో సంతోషంతో గంతులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వీక్షకుల మనసు దోచేస్తోంది.

Watch: Deer Shoot The Football Into Goal Post Later Enjoy with Dance
గురి చూసి గోల్​ తన్నిన లేడి... ఆపై గంతులు వేస్తూ సందడి

By

Published : Jan 3, 2020, 7:16 PM IST

ఈ మధ్య కాలంలో ఓ ఆవు ఫుట్​బాల్​ ఆడి సందడి చేయగా... తాజాగా అదే తరహాలో ఓ జింక పిల్ల కనువిందు చేసింది. తన కొమ్ములతో బంతిని తోసుకుంటూ వెళ్లి గోల్​పోస్టులో వేసింది. అంతేకాదు గోల్​ వేసిన తర్వాత ఆనందంతో గంతులు వేసింది. తాజాగా ఈ వీడియోను ఓ ఐఏఎస్​ అధికారి సోషల్​ మీడియాలో పోస్టు చేస్తూ.. ఓ సందేశం ఇచ్చారు. " మీ ముందు ఎలాంటి ప్రత్యర్థి లేకపోయినా... మీ లక్ష్యం చేరుకునే వరకు ఆనందంగా ఉండండి" అని ట్యాగ్​లైన్​ రాసుకొచ్చారు. ఈ వీడియోపై వీక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గురి చూసి గోల్​ తన్నిన జింక... ఆపై గంతులు వేస్తూ సందడి

కొందరు "సూపర్ గోల్​"​ , "జింక సెలబ్రేషన్​ బాగుంది", " మనిషి కూడా అనుకున్నది సాధిస్తే ఇలానే ఆనందంతో గంతులు వేస్తాడు" అని ట్వీట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details