తెలంగాణ

telangana

ETV Bharat / sports

వావ్.. అనిపిస్తున్న ఒలింపిక్ మైదానం - Tokyo 2020: Olympic stadium officially opened.. attracted very much

వచ్చే ఏడాది జపాన్ టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్​ కోసం మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. దాదాపు 68వేల మంది కూర్చొని ఆటలను వీక్షించేలా క్రీడా వేదికను సిద్ధం చేశారు. రూ.10వేల కోట్లతో ఈ స్టేడియాన్ని నిర్మించారు.

Tokyo 2020: Olympic stadium officially opened.. attracted very much
ఒలింపిక్స్ స్టేడియం

By

Published : Dec 21, 2019, 9:53 AM IST

ఒలింపిక్ స్టేడియం ప్రారంభం

ఒలింపిక్స్‌ నిర్వహించాలంటే ప్రధానమైన స్టేడియం ఒకటి కావాలి.. ఇందులోనే ప్రారంభోత్సవం, ముగింపోత్సవాలతో పాటు ముఖ్యమైన ఈవెంట్లు జరుగుతాయి. వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఒలింపిక్స్‌ కోసం టోక్యో కూడా తన ప్రధాన స్టేడియాన్ని సిద్ధం చేసేసింది. ఇటీవలే ఈ స్టేడియాన్ని ఘనంగా ఆరంభించారు. ఈ మైదానానికి సంబంధించిన ఫొటోలు తాజాగా విడుదల చేశారు ఒలింపిక్స్​ నిర్వాహకులు.

ఒలింపిక్ మైదానంలో లోపల

ఒకేసారి 68వేలమంది...

దాదాపు 68 వేల మంది కూర్చొని ఆటలను వీక్షించే వీలున్న ఈ క్రీడా వేదికను ప్రముఖ జపాన్‌ రూపశిల్పి కెంగో కుమా డిజైన్‌ చేశాడు. ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌ కూడా ఇక్కడే జరగనున్నాయి. దీని నిర్మాణం 2016 డిసెంబర్‌లో ఆరంభం కాగా.. మొదట బ్రిటన్‌ రూపశిల్పి జహా హజీద్‌ డిజైనింగ్‌ ఆరంభించాడు. ఆ తర్వాత ఖర్చు తగ్గించుకునేందుకు డిజైన్​లో మార్పులు చేశారు. ఫలితంగా హజీద్​ స్థానంలో కెంగో కుమాకు బాధ్యతలు అప్పగించారు.

స్టేడియం వెలుపల

10 వేల కోట్లతో నిర్మాణం...

ఈ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ స్టేడియం వేదికగా మొదట 2019 రగ్బీ ప్రపంచకప్‌ నిర్వహించాలనుకున్నా పనులు ఆలస్యం కావడంతో కుదరలేదు. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ స్టేడియంలో ఒలింపిక్స్‌ కన్నా ముందు ఎంపరర్స్‌ కప్‌ సాకర్‌ టోర్నీని నిర్వహిస్తున్నారు.

విద్యుత్ దీపాల కాంతులతో స్టేడియం
స్టేడియంలో ఫీల్డ్ ట్రాక్
పచ్చటి గడ్డితో ఆకట్టుకుంటున్న మైదానం

ఇదీ చదవండి: ఐపీఎల్​ వేలం: బాలీవుడ్ బాలనటుడు ముంబయి సొంతం

ABOUT THE AUTHOR

...view details