ప్రతిసారి జరిగినట్లే ఎంతోమంది అనామక ప్రతిభావంతులు ఐపీఎల్ వేలంలోకి వచ్చారు. అందులో కొందరిని ఫ్రాంఛైజీలు కొనుక్కున్నాయి. అందులో ఓ కుర్రాడే దిగ్విజయ్ దేశ్‌ముఖ్. విశేషమేంటే అతడికి ఇంతకుముందే గుర్తింపుంది. కానీ క్రికెటర్‌గా కాదు.. నటుడిగా. 2013లో విడుదలైన హిందీ చిత్రం 'కై పో చే' లో అతడు బాలనటుడిగా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు.
క్రికెటర్‌గా తన నటనతో ఆకట్టుకున్న ఈ కుర్రాడిని.. గురువారం జరిగిన వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ముంబయి ఇండియన్స్ అతణ్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల దేశ్‌ముఖ్ ఆల్‌రౌండర్. మహారాష్ట్ర తరఫున ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
"అవును.. ‘కై పో చే’ సినిమాలో నేను అలీగా నటించా. కానీ నేనెప్పుడూ నటుణ్ని కాదు. ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా నా కలను నెరవేర్చుకుంటున్నా ఎవరైనా నన్ను నటుడు అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆ సినిమాలో నావి ఎక్కువగా క్రికెట్ ఆడే దృశ్యాలే ఉంటాయి. అందుకే అందులో నటించేందుకు ఒప్పుకున్నా" -దిగ్విజయ్ దేశ్‌ముఖ్, యువ క్రికెటర్.
అలీ (దేశ్‌ముఖ్) చివరికి టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేయడంతో ఆ సినిమా ముగుస్తుంది. మరి నిజ జీవితంలోనూ దేశ్‌ముఖ్ తన కలను నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి.
ఇదీ చదవండి: బుమ్రాకు ద్రవిడ్ షాక్.. ఫిట్‌నెస్ పరీక్షకు తిరస్కారం