రిషభ్ పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని దిల్లీ కెప్టెన్‌గా అతడు సరైన ప్రత్యామ్నాయమని ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ సీజన్‌లో పంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పాంటింగ్ ఇలా వ్యాఖ్యానించాడు. ''దిల్లీకి కెప్టెన్ రిషభ్ పంత్ సరైన ప్రత్యామ్నాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత దిల్లీని రిషభ్సమర్థంగా నడిపించాడు. రిషభ్ ఇంకా కుర్రాడే. సారథ్యంలో లోటుపాట్లను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. ఇలాంటి లీగ్‌లో తీవ్రమైన ఒత్తిడి ఉంటే టోర్నీలో సారథ్యం అంత సులభం కాదు. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని అంతా నిశితంగా గమనిస్తారు. అందుకే పంత్‌కు మద్దతు ఇస్తున్నా'' అని రికీ చెప్పాడు. ముంబయితో మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన పంత్ ఒక్కడినే నిందించడం తగదని.. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓ కారణమని పాంటింగ్ అన్నాడు. ''ముంబయితో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో మ్యాచ్ మా చేజారిపోయింది. ఇందుకు కెప్టెన్ పంత్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయలేం. మా టాప్ ఆర్డర్ వైఫల్యం వల్లే జట్టు సరైన స్కోరు చేయలేకపోయింది. ఈ సీజన్లో మా బ్యాటర్లు స్థిరంగా రాణించలేకపోయారు'' రికీ పేర్కొన్నాడు.
వద్దనుకునే వదిలేశాం: పంత్