తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఫ్రీ వ్యాక్సిన్​

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే అథ్లెట్లకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ అందించేందుకు ఫైజర్​, బయోఎన్​టెక్​ ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. ఈ నెలలోనే వాటి సరఫరా మొదలవుతుందని వెల్లడించింది.

olympics
ఒలింపిక్స్‌

By

Published : May 6, 2021, 8:10 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఉచితంగా కరోనా టీకా అందించేందుకు ఫైజర్‌, బయోఎన్‌టెక్ ముందుకు వచ్చినట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. ఈ నెలలోనే వాటి సరఫరా మొదలవుతుందని తెలిపింది. జులై 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా ఆ సమయానికి ముందే ఒలింపిక్స్‌కు వచ్చే వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐఓసీ వివరించింది.

ఇప్పటికే.. టోక్యో ఒలింపిక్స్‌కు వచ్చే వారికి వ్యాక్సినేషన్ చేయాల్సిందిగా చైనా వ్యాక్సిన్ సంస్థలతో ఒప్పందం కుదరగా ఇప్పుడు ఫైజర్‌, బయోఎన్‌టెక్‌తో జరిగే ఒప్పందం రెండో అతిపెద్ద డీల్​ కానుందని ఐఓసీ తెలిపింది. చైనా సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు కూడా టీకా ఇవ్వాల్సి ఉంది. చైనా వ్యాక్సిన్లకు ఇప్పటికీ అనేక దేశాలు అత్యవసర అనుమతి ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా ఫైజర్‌తో కుదిరిన ఒప్పందం ఐఓసీకి అతిపెద్ద ఊరట కల్పించింది. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌కు వచ్చే ప్రముఖులు, అథ్లెట్లు ఎక్కడ వీలైతే అక్కడ టీకాలు వేయించుకోవాలని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్​ సూచించారు.

ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం 'భారత్'​ జంబో టీమ్!

ABOUT THE AUTHOR

...view details