తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్ ట్రయల్స్ ఫైనల్లో మేరీ - నిఖత్ ఢీ - Nikhat - Mary Kom Match

మేరీకోమ్ - నిఖత్ జరీన్ బాక్సింగ్ రింగులో తలపడనున్నారు. ఒలింపిక్స్ ట్రయల్స్ ఫైనల్లో జ్యోతిపై నెగ్గిన నిఖత్​.. తుదిపోరులో మేరీని ఢీకొట్టనుంది.

Nikhat Zareen sets up 51kg final vs Mary Kom in trials for Olympic qualifiers
నిఖత్ - మేరీ కోమ్

By

Published : Dec 27, 2019, 9:14 PM IST

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ - నిఖత్ జరీన్ మధ్య పోరు జరగనుంది. ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం నిర్వహించిన ట్రయల్స్​లో హైదరాబాదీ బాక్సర్ జరీన్.. జ్యోతి గులియాను ఓడించింది. 51కేజీల విభాగంలో తొలి రౌండ్​లోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.

అంతకుముందు రీతూ గ్రేవాల్​పై గెలిచింది మేరీ కోమ్. శనివారం నిఖత్ - మేరీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన వారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా వేదికగా జరగనున్న ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత్ తరఫున తలపడతారు.

ఒలింపిక్స్ అర్హత పోటీలకు ట్రయల్స్ నిర్వహించాలని హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్​ కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసింది. ఈ మేరకు రెండు రోజులు పాటు ఈ పోటీలను నిర్వహించింది భారత బాక్సింగ్ ఫెడరేషన్​. 51, 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో ఈ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: వైరల్​: జకోకు ఎలా ఎగరాలో నేర్పిస్తున్న రొనాల్డో

ABOUT THE AUTHOR

...view details