తెలంగాణ

telangana

ETV Bharat / sports

మోదీ పరిచయం చేసిన ఇండియన్​ బెక్​హామ్ ఎవరు?

ప్రధానమంత్రి 'మన్​ కీ బాత్' కార్యక్రమంలో ఓ దేశీయ ఆటగాడి గురించి ప్రస్తావించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియాలో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరచాడని తెలిపారు. అండమాన్​కు చెందిన 'డేవిడ్​ బెక్​హామ్​' సైక్లింగ్​లో మెరిసి అందరినీ ఆకట్టుకున్నాడు.

Meet India's own 'David Beckham', whom PM Modi mentioned in Mann ki Baat
మోదీ పరిచయం చేసిన ఇండియన్​ బెక్​హామ్ ఎవరు?

By

Published : Jan 27, 2020, 5:34 AM IST

Updated : Feb 28, 2020, 2:34 AM IST

ప్రతి నెల జరిగే 'మన్​ కీ బాత్​' కార్యక్రమంలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 'ఖేలో ఇండియా' గేమ్స్ మూడవ ఎడిషన్‌లో పాల్గొన్న వారందరినీ అభినందించారు. అట్టడుగు స్థాయిలో ఉన్న క్రీడలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ ప్రచారం జనవరి 22 ముగిసింది. ఈ ప్రచారంలో 6000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో అనేక మంది క్రీడాకారుల గురించి ప్రస్తావించారు. ఇందులో అండమాన్​కు చెందిన 'డేవిడ్ బెక్​హామ్​' పేరు కూడా ఉంది.

పుట్​బాల్ క్రీడాకారుడు​ డేవిడ్​ బెక్​హామ్​, ఇండియన్​ డేవిడ్​ బెక్​హామ్​

"నేను ఇప్పుడు 'డేవిడ్​ బెక్​హామ్​' గురించి చెప్పాలనుకుంటున్నా. డేవిడ్​ బెక్​హామ్​ అంటే మీరు కచ్చితంగా పుట్​బాల్​ ఆటగాడని పొరపడతారు. ఆయన పుట్​బాల్​లో ఉన్నతమైన ఆటగాడు. కానీ, ఇప్పుడు మన మధ్య 'డేవిడ్ బెక్​హామ్​' ఉన్నాడు. గువహటిలో జరిగిన యూత్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. సైక్లింగ్‌లో 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో మేటిగా నిలిచాడు."
- నరేంద్రమోదీ,ప్రధానమంత్రి

డేవిడ్ మొదట 2017లో దిల్లీలో సైక్లింగ్​లో శిక్షణ పొందాడు. 17 ఏళ్ల వయసులో సునామి కారణంగా తండ్రిని కోల్పోయాడు. పది సంవత్సరాల తర్వాత తన తల్లి సంక్రమణ కారణంగా మరణించిందని బెక్​హామ్​ వెల్లడించాడు.

ఇదీ చూడండి.. రెండో మ్యాచ్​లో పరిస్థితులు మారాయి: రాహుల్

Last Updated : Feb 28, 2020, 2:34 AM IST

ABOUT THE AUTHOR

...view details