తెలంగాణ

telangana

ETV Bharat / sports

కామన్వెల్త్​ గేమ్స్ బహిష్కరణపై ఐఓఏ యూటర్న్​ - IOA Summit

న్యూదిల్లీలో సోమవారం.. భారత ఒలింపిక్ సంఘం సాధారణ వార్షిక సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

IOA withdraws its proposal to boycott 2022 Commonwealth Games
భారత ఒలింపిక్ సంఘం

By

Published : Dec 30, 2019, 7:56 PM IST

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న 2022 కామన్వెల్త్ గేమ్స్​ను బహిష్కరించాలనే ప్రతిపాదనపై భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) యూటర్న్ తీసుకుంది. ఆ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది.

అంతేకాకుండా 2026, 2030లోకామన్వెల్త్క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు బిడ్ వేయాలని ఐఓఏ నిర్ణయించింది. 2026 యూత్ ఒలింపిక్స్​, 2032 ఒలింపిక్ గేమ్స్​ను నిర్వహించేందుకు అభ్యర్థన పెట్టుకోవాలనే స్పష్టతకు వచ్చింది.

2020 టోక్యో ఒలింపిక్స్​లో భారత్ నుంచి 150 మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2020లో జాతీయ క్రీడలను గోవా వేదికగా నిర్వహించాలనే నిర్ణయంతో సమావేశం ముగిసింది. అంతేకాకుండా 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ అసోసియేషన్ సమావేశం భారత్​లో జరగనుందని ప్రకటించింది.

2022కామన్వెల్త్క్రీడల్లో షూటింగ్​ను తీసివేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఆ పోటీల్లో పాల్గొనకూడదని క్రీడల మంత్రి కిరణ్​ రిజిజుకు లేఖ రాశారు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా.

ఇదీ చదవండి: బట్టలేసుకొని బాడీ బిల్డింగ్ పోటీల్లో మహిళలు

ABOUT THE AUTHOR

...view details