Qatar World Cup Final 30 Lakh Tickets: ఖతార్‌లో డిసెంబర్ 18న జరిగే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌ను నేరుగా చూసేందుకు ముప్పై లక్షల మంది అభిమానులు పోటీపడుతున్నారట. ఫైనల్ టిక్కెట్ కావాలని కోరుతూ తమకు ముప్పై లక్షల విజ్ఞప్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 26న అర్జెంటీనా-మెక్సికో మ్యాచ్‌ను తిలకించేందుకు 25 లక్షల మంది ఆసక్తి ప్రదర్శించారు. ఈ మ్యాచ్ జరిగే లుసాయిల్ స్టేడియం సామర్థ్యం 80000 మాత్రమే.
ఇదీ క్రేజ్ అంటే.. ఆ మ్యాచ్ కోసం 30 లక్షల మంది! - FIFA
ఓ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏకంగా ముప్పై లక్షల మంది అభిమానులు పోటీపడుతున్నారట. ఆ మ్యాచ్ ఫైనల్ టిక్కెట్ కావాలని కోరుతూ తమకు ముప్పై లక్షల విజ్ఞప్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ వివరాలు..
నవంబర్ 21న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో అమెరికా-ఇంగ్లాండ్ మ్యాచ్ వీక్షించేందుకు కూడా పది లక్షలకు పైగా అభిమానులు ఎదురు చూస్తున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్రెజిల్, రష్యాల్లో జరిగిన ప్రపంచకప్‌లతో పోలిస్తే ఖతార్‌లో పెద్దగా పర్యాటక ప్రదేశాలు లేకపోవడం దెబ్బే అయినా.. అభిమానులు మాత్రం తగ్గట్లేదు. దోహాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటల్స్ ఇప్పటికే నిండిపోయినట్లు వెబ్‌సైట్లు చూపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఈ ఐపీఎల్ సీజన్లో టాప్ కెప్టెన్ ఎవరో తెలుసా?