తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2019, 4:36 PM IST

ETV Bharat / sports

బాక్సింగ్ చేస్తూ కోమాలోకి.. ఆపై ప్రాణాలు..!

చికాగోలో జరిగిన ఓ బాక్సింగ్ టోర్నీలో గాయపడ్డ పేట్రిక్ అనే బాక్సర్.. నాలుగు రోజులు మరణంతో పోరాడి తుదిశ్వాస విడిచాడు.

అమెరికన్ బాక్సర్ పేట్రిక్

గత శనివారం చికాగో వేదికగా జరిగిన సూపర్​ వాల్టర్​వెయిట్​ బౌట్​లో గాయపడిన అమెరికన్ బాక్సర్ పేట్రిక్ కోమాలోకి వెళ్లాడు. అనంతరం నాలుగురోజులపాటు మృత్యువుతో పోరాడి, బుధవారం తుదిశ్వాస విడిచాడు. అతడికి ప్రమోటర్​గా వ్యవహరిస్తున్న లూ డిబెల్లా ఈ విషయంపై మాట్లాడాడు.

"పేట్రిక్.. ఓ కొడుకు, తమ్ముడు, చాలా మందికి మంచి స్నేహితుడు. కలిసిన వారందరూ అతడ్ని అభిమానిస్తారనడంలో సందేహం లేదు" -లూ డిబెల్లా, పేట్రిక్ ప్రమోటర్

చార్లెస్ కాన్​వెల్​తో జరిగిన ఈ పోరులో, రెండుసార్లు గాయపడ్డ పేట్రిక్.. మూడోసారి పంచ్​ పెద్దగా తగలడం వల్ల బౌట్​ను కొనసాగించలేకపోయాడు. అప్పుడు స్ట్రెచర్​పై అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పేట్రిక్ మృతికి సంతాపంగా ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ ట్వీట్

ఇది చదవండి: నాపై వార్తలు అవాస్తవం.. నేను బతికే ఉన్నాను: అఫ్గాన్ క్రికెటర్ నబీ

ABOUT THE AUTHOR

...view details