తెలంగాణ

telangana

అభినవ్ అద్భుత ప్రదర్శనకు పదకొండేళ్లు

By

Published : Aug 11, 2019, 2:24 PM IST

Updated : Sep 26, 2019, 3:39 PM IST

భారత స్టార్ షూటర్​ అభినవ్​ బింద్రా ఒలింపిక్స్​లో బంగారు పతకాన్ని సాధించి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 బీజింగ్​లో జరిగిన విశ్వక్రీడల్లో 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్​ విభాగంలో స్వర్ణం సాధించాడీ షూటర్.

అభినవ్​ బింద్రా, షూటర్

అభినవ్ బింద్రా 2008 బీజింగ్​ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు అభినవ్ బింద్రానే​. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్​ విభాగంలో పసిడి కైవసం చేసుకున్నాడు.

"గత ఏడాది ఇదే సమయంలో మన అథ్లెట్లు బంగారు పతకాలు సాధించగా.. ఆ వేడుకల్లో బిజీగా ఉన్నాను. ఇంకా ఎన్నో మెడల్స్​ కోసం వాళ్లు కృషి చేయాలని కోరుకుంటున్నా. అయితే, ఇందులో వారు ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదు" -అభినవ్​ బింద్రా, షూటర్​

2016లో జరిగిన రియో ఒలింపిక్స్​లో నాలుగో స్థానంలో నిలిచిన బింద్రా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం ఆటకు రిటైర్​మెంట్​ ఇచ్చేశాడీ షూటర్.

ఇదీ సంగతి: వాలీబాల్​ ఫైట్​: పాక్​తో అమీతుమీకి భారత్​ సిద్ధం

Last Updated : Sep 26, 2019, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details