దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ శివ థాప(64 కేజీ) వరుసగా ఐదో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో కువైట్ బాక్సర్ నాదర్ ఓడాపై 5-0 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన థాప.. ఈ సీజన్లో ఏదో ఒక పతకాన్ని గెలుపొందనున్నాడు.
మరో పోటీలో మహమ్మద్ హుసాముద్దీన్(56 కేజీ) పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ మిరాజిజ్‌బెక్ మిర్జాహాలిలోవ్తో జరిగిన పోరులో 1-4తో ఓడిపోయాడు. ఆసియన్ గేమ్స్ ఛాంపియన్ అయిన మిరాజిజ్‌బెక్.. తీవ్రమైన పంచ్‌లతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. హుసాముద్దీన్ ఒకట్రెండు పంచ్‌లతో పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.