తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాకీ జాతీయ ఛాంపియన్​షిప్ టోర్నీలు మళ్లీ వాయిదా - latest sports news

లాక్​డౌన్ తేదీ పొడిగించడం వల్ల భారత్​లో జరగాల్సిన నేషనల్​ హాకీ ఛాంపియన్​షిప్స్​ను మళ్లీ వాయిదా వేశారు. కొత్త తేదీలు, ప్రస్తుత పరిస్థితి సర్దుకున్న తర్వాత వెల్లడిస్తారు.

Lockdown extension: Hockey India postpones all Nat'l C'ships indefinitely
హాకీ జాతీయ ఛాంపియన్​షిప్ టోర్నీలు మళ్లీ వాయిదా

By

Published : Apr 14, 2020, 5:40 PM IST

హాకీ ఇండియా జాతీయ​​ ఛాంపిన్​షిప్స్​ టోర్నీలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు అధికారులు. కరోనా కారణంగా ఏప్రిల్ 14 వరకు తొలుత లాక్​డౌన్ విధించారు. దీంతో ఏప్రిల్ 29 నుంచి జులై 3 వరకు క్రీడలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆ లాక్​డౌన్​ను మే 3వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం, ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీంతో పోటీలు ఆపక తప్పలేదు. అయితే వాటిని ఎప్పటికి వాయిదా వేశారు అనే విషయాల్ని మాత్రం వెల్లడించలేదు.

హాకీ ఆటగాళ్లు, కోచ్​లు, నిర్వహకులు, అభిమానులు, అధికారులు ఆరోగ్యం దృష్ట్యా ఈ పోటీలను వాయిదా వేశామని చెప్పారు హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్. ప్రస్తుత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామన్నారు.

ఇదీ చూడండి : యువరాజ్​ ఫౌండేషన్‌కు అఫ్రిది భారీ విరాళం

ABOUT THE AUTHOR

...view details