తెలంగాణ

telangana

ETV Bharat / sports

కార్డుతో పొమ్మని, సెల్ఫీకి రమ్మని పిలిచిన రిఫరీ - brazil,ronaldo, football

ఫుట్​బాల్​ క్రీడలో ఆటగాళ్లతో పాటు రిఫరీలు కూడా ప్రధానపాత్ర పోషిస్తారు. క్రీడాకారులు నియమాలు ఉల్లంఘించకుండా చూస్తూ.. వారితో పాటే మైదానంలో పరుగులు పెడుతుంటారు. ఎవరైనా తప్పిదాలు చేస్తే హెచ్చరించి... హద్దు మీరితే పసుపు, ఎరుపు రంగు కార్డులు చూపించి శిక్షిస్తారు. తాజాగా ఓ మ్యాచ్​లో హాస్యభరిత సన్నివేశం చోటు చేసుకుంది.

అధికారం, అభిమానం ఒకేసారి ప్రదర్శించిన రిఫరీ

By

Published : Nov 1, 2019, 6:07 PM IST

ఇటీవల ఇజ్రాయేల్​లోని హైఫాలో... బ్రెజిల్​ - ఇజ్రాయేల్​ జట్ల మధ్య స్నేహపూర్వక ఫుట్​బాల్​ మ్యాచ్​ జరిగింది. ఇందులో బ్రెజిల్​ జట్టు 4-2తేడాతో విజయం సాధించింది. అయితే మైదానంలో బ్రెజిల్‌ స్టార్‌ కాకాతో మహిళా రిఫరీ సెల్ఫీ దిగడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఆటలో భాగంగా స్టార్​ ప్లేయర్​ కాకాకు పసుపు రంగు కార్డు చూపించింది రిఫరీ లిలాచ్‌ అసులిన్‌. అనంతరం తన ఫోన్​ తీసి కాకాతో సెల్ఫీ దిగింది. ఈ సంఘటనకు తోటి ఆటగాళ్లతో పాటు వీక్షకులూ ఆశ్చర్యపోయారు. నెటిజన్లు మాత్రం రిఫరీ చిన్నపిల్లలా, సరదాగా ప్రవర్తించిందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details