తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల ఫిఫా వరల్డ్​కప్: నాలుగోసారి విజేతగా అమెరికా

ఫిఫా మహిళల ప్రపంచకప్​లో మరోసారి అమెరికా జట్టు జగజ్జేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్​లో నెదర్లాండ్స్​ను ఓడించి టైటిల్​ కైవసం చేసుకుంది. ఫలితంగా నాలుగోసారి వరల్డ్​కప్​ గెలిచి రికార్డు సృష్టించింది అగ్రరాజ్యం జట్టు.

నాలుగోసారి మహిళా ఫిఫా కప్​ విజేత అమెరికా

By

Published : Jul 8, 2019, 6:19 AM IST

ఫ్రాన్స్​ నిర్వహించిన ఫిఫా మహిళల ప్రపంచకప్-2019 విజేతగా అమెరికా అవతరించింది. ఫలితంగా నాలుగోసారి ప్రపంచ ఫుట్​బాల్​​ ఛాంపియన్​ను కైవసం చేసుకుంది. ఫ్రాన్స్​లోని లయన్ నగరంలో పార్క్​ ఒలింపిక్​ లయోనిస్​ మైదానంలో ఆదివారం నెదర్లాండ్స్​, అమెరికా మధ్య ఫిఫా ఫైనల్​ జరిగింది. ఈ మ్యాచ్​లో నెదర్లాండ్స్​ జట్టును 2-0 తేడాతో ఓడించారు అమెరికా క్రీడాకారిణులు.

నాలుగోసారి ఛాంపియన్​...

ఈ విజయంతో నాలుగోసారి ప్రపంచకప్​ గెలిచి చరిత్ర సృష్టించింది అమెరికా.వరుసగా రెండోసారి విజేతగా నిలిచి గతంలో జర్మని నెలకొల్పిన రికార్డును సమం చేసింది. 1991లో ప్రారంభమైన ఫిఫా మహిళల ప్రపంచకప్​లో తొలి టైటిల్​ విజేతగా నిలిచింది అమెరికా. తర్వాత 1999, 2015లో మరో రెండుసార్లు ఛాంపియన్​గా అవతరించింది.

  1. 2011లోనూ ఫైనల్​ చేరినా జపాన్​ చేతిలో ఓటమిపాలయ్యారు అమెరికా అమ్మాయిలు.
  2. 1995, 2003, 2007లో మూడోస్థానంలో నిలిచింది అగ్రదేశం.

బంగారు బూటు, బంతి విజేత​...

టోర్నీ మొత్తంగా అత్యధిక గోల్స్​ చేసిన క్రీడాకారిణికి బంగారు బూటు అందజేస్తారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి బంగారు బంతి అందజేస్తారు. ఫిపా మహిళల ప్రపంచకప్​ 2019 టోర్నీలో సత్తచాటి బంగారు బంతి, బూటును గెలుచుకుంది మేగన్​ రాపినోయ్​.

" ఈ మెగాటోర్నీలో మాకున్న అనుభవంతోనే రాణించాం. కష్టమైన ప్రత్యర్థులతో తలపడ్డాం. యువ క్రీడాకారిణుల వెనుక సీనియర్ల భరోసా ఉంది కాబట్టే ఇంత విజయం సొంతమైంది. నాకౌట్​ రేసులో నిలిచేందుకు చాలా శ్రమించాం కాని చివరికి కప్పు గెలిచాం".
--మేగన్​ రాపినోయ్​

టోర్నీలో అత్యధిక గోల్స్​ చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచిన మరో అమెరికా క్రీడాకారిణి అలెక్స్​ మోర్గాన్​ వెండి బూటు గెలుచుకుంది.

కోచ్​ అరుదైన ఘనత..

అమెరికా జట్టు కోచ్​ జిల్​ ఎలిస్​ హయాంలోనే ఆ దేశానికి రెండోసారి ప్రపంచకప్​ దక్కింది. ఇప్పటివరకు ఎవ్వరూ వరుసగా రెండు టైటిల్స్​ అందించలేదు.

అమెరికా జట్టు కోచ్​ జిల్​ ఎలిస్

ఓటమి కన్నా అనుభవం ముఖ్యం...

ఫైనల్​లో ఓడి రన్నరప్​గా నిలిచింది నెదర్లాండ్స్​ .ఆ జట్టు ఓటమి తర్వాత మాట్లాడిన కోచ్ సెరీనా విగ్​మ్యాన్​​... మహిళలకు ప్రోత్సాహం అందిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని అభిప్రాయపడింది.

రన్నరప్​గా నెదర్లాండ్స్​ జట్టు

"మేము ఫైనల్​ గెలవాలని ఆశపడ్డాం. కాని సాధించలేకపోయాం. ప్రత్యర్థి బలంగా ఉండటం వల్లే మేము రన్నరప్​గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. తొలిసారి ఒలింపిక్స్​లో అడుపెడుతున్నాం. మా జట్టులో సగటు వయసు 26 సంవత్సరాలు. మరింత అనుభవం సంపాదిస్తే వాళ్లందరూ మంచి విజయాలు అందించగలరు. నేను జాతీయ జట్టుపై ఎక్కువ దృష్టి పెడతాను. గతంలో మహిళలు ఫుట్​బాల్​లోకి వచ్చేవారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. వారికి కొంచెం తోడ్పాటు అవసరం. మహిళలను ఫుట్​బాల్​లోకి రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను ".
-- సెరీనా విగ్​మ్యాన్, నెదర్లాండ్స్​ కోచ్​

సెరీనా విగ్​మ్యాన్, నెదర్లాండ్స్​ కోచ్​

విశేషాలు..

  1. ఈ ఏడాది ప్రపంచకప్​తో తొలిసారి ఫైనల్​ వరకు వెళ్లింది నెదర్లాండ్స్​ జట్టు.
  2. ఒకే వరల్డ్​కప్​లో అత్యధిక గోల్స్​ కొట్టిన జట్టు అమెరికా(26).
  3. గోల్డెన్​ బూటు గెలుచుకున్న మేగన్​ రాఫినోయ్​... అతిపెద్ద వయసున్న గోల్​స్కోరర్​గా రికార్డు సృష్టించింది. 34 సంవత్సరాల రెండు నెలల వయసున్న ఆమె గతంలో కార్లీ లైలాయిడ్(32 సంవత్సరాల 354 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్​ చేసింది.
  4. ఫ్రాన్స్‌లో విజేతలకు 40 లక్షల డాలర్లు(రూ.27 కోట్ల 38 లక్షలు) లభిస్తాయి. ఈ మొత్తం 2015 టోర్నమెంట్​ ప్రైజ్​మనీకి రెట్టింపు .
  5. గత ఏడాది పురుషుల వరల్డ్ కప్‌లో ఇచ్చిన మొత్తం నగదు బహుమతులు 40 కోట్ల డాలర్లు. ఇది మహిళా ఫుట్‌బాల్ టోర్నమెంటు జట్లకు ఇస్తున్న మొత్తం కన్నా పది రెట్లు ఎక్కువ. అందుకే ఇప్పటికీ మహిళల-పురుషుల వేతనాల మధ్య వ్యత్యాసంపై చర్చ జరుగుతోంది.

అమెరికా మహిళల జట్టు విజయంపై ఆ దేశ పురుషుల స్టార్​ ప్లేయర్​ లాన్​డన్​ డొనోవన్​, టెన్నిస్​ స్టార్​ సెరెనా విలియమ్స్​, ప్రముఖ వ్యాఖ్యాత ఎలెన్​ ప్రశంసలు కురిపించారు.

ABOUT THE AUTHOR

...view details