ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్ఎల్) 7వ సీజన్ శుక్రవారం ప్రారంభం అయింది. తొలి మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ విజయం సాధించింది. కేరళ బ్లాస్టర్స్‌ను 0-1 తేడాతో ఓడించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది.
ఐఎస్ఎల్: బ్లాస్టర్స్‌ను మట్టికరిపించిన బగాన్ జట్టు
ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎల్ 7వ సీజన్‌ను విజయంతో ఆరంభించింది ఏటీకే మోహన్ బగాన్ జట్టు. గోవాలోని బంబోలిమ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది.
ఐఎస్ఎల్: బ్లాస్టర్స్‌ను మట్టికరిపించిన బగాన్ జట్టు
బగాన్ జట్టు హిట్‌మ్యాన్ రాయ్ క్రిష్ణ.. తన జట్టుకు 67వ నిమిషంలో తొలి గోల్ అందించాడు. అయితే ప్రత్యర్థులు మాత్రం ఒక్క పాయింటు సాధించలేకపోయారు. రాయ్ గత సీజన్లోనూ 15 గోల్స్ సాధించి టాప్ గోల్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
గత సీజన్ ఛాంపియన్ అట్లెటికో ది కోల్‌కతా (ఏటీకే), ఐ- లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ మోహన్ బగాన్ కలిసి ఒకే జట్టు (ఏటీకే మోహన్ బగాన్)గా ప్రస్తుతం బరిలోకి దిగాయి.